![]() |
![]() |

నందు తన కంపెనీ పార్టనర్ తో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి తులసి లాస్యకి ఫోన్ చేస్తుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఇక ఆ టైములో నందు తులసిని తిట్టడం లాస్యాని పొగడడం చేస్తాడు. నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం లాస్య అడగగానే 20 లక్షలు తెచ్చి ఇచ్చింది అని తాగి వాగేసరికి ఫోన్ లైన్ లో ఉన్న తులసి షాక్ అవుతుంది. తర్వాత లాస్య పక్కకు వెళ్లి తులసితో ఏమీ తెలియనట్టు ఫోన్ మాట్లాడుతుంది. అవసరంలో ఉంటె లక్షా రెండు లక్షలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ 20 లక్షలు ఇచ్చేంత ఫ్రెండ్స్ ఉన్నారా నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉంటె బాగుండు అంటుంది కావాలనే.
ఇక తులసికి అసలు సీన్ అర్థమైపోతుంది. కానీ లాస్య మాత్రం తులసికి నిజం గాని తెలిసిపోయిందా అంటూ భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత జరిగిన విషయం అంకిత వాళ్లకు చెప్పేస్తుంది తులసి. ఆ తర్వాత వాళ్ళకో ప్లాన్ చెప్తుంది. దాంతో అంకిత వాళ్ళు భాగ్యను తులసి ఇంటికి రప్పిస్తారు. లాస్యకి ఇది ప్లాన్ అని తెలీక మన ప్లాన్ వర్కౌట్ కావాలంటే నువ్వు తులసి ఇంట్లోనే ఉండి తులసి ఏం చేస్తుందో గమనించు అని చెప్తుంది. భాగ్య తులసి ఇంటికి వస్తుంది. అక్కడికి వచ్చిన పరంధామయ్య జోడి భాగ్యతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక తులసి లాస్యను, భాగ్యను రోడ్డు మీద పరుగులు పెట్టిస్తుంది. ఫైనల్ గా లాస్యకు తులసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇవి ఈరోజు గృహలక్ష్మి సీరియల్ అప్ డేట్స్.
![]() |
![]() |